Header Banner

కొత్త రేషన్ కార్డుల జారీ పై కీలక అప్డేట్! క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు.. రాష్ట్రంలో 93.42 లక్షల మందికి..

  Sat Feb 22, 2025 20:34        Politics

రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల నుంచి కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌(Minister Nadendla Manohar) వెల్లడించారు. ఈ రేషన్ కార్డులు(Ration cards) ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్ కోడ్ లను కలిగి ఉంటాయని తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Minister Anam Ramanarayana Reddy), ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(MP Vemireddy Prabhakar Reddy)తో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగం సమీపంలోని రైసుమిల్లును, జెండాదిబ్బ వద్దనున్న బహుళ ప్రయోజన సౌకర్య గోదాము (స్టాక్‌ పాయింట్‌)ను మంత్రి తనిఖీ చేశారు. రైసుమిల్లును తనిఖీ చేసి ధాన్యం సేకరణకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెండా దిబ్బ వద్ద స్టాక్ పాయింట్‌ను తనిఖీ చేసి స్టాకు వివరాలు, సరఫరా మొదలైన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్‌ మహిళలనుద్దేశించి మాట్లాడారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమన్నారు. మహిళలందరూ కూడా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్‌ కార్డులను అందిస్తామని చెప్పారు. రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దీపం-2 పథకం హామీని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నెరవేర్చారని, ఇందులో భాగంగా ఈ జిల్లాలో 4 లక్షల మందికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 93.42 లక్షల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని, ఈ ఏడాది 1.50 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారం మహిళలందరూ తెలుసుకోవాలని, భాగస్వామ్యం కావాలని సూచించారు. మే నెల నుంచి అన్ని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం మంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు. 

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనం పథకంపై అపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! డేట్ ఫిక్స్! ఈ నెలలో...

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NewRationCards #APPolitics NadendlaManohar #AndhraPradesh